ఏపీలో భూ సర్వే కోసం అధునాతన డ్రోన్లు... పరిశీలించిన సీఎం జగన్

31-03-2022 Thu 15:37 | Andhra
  • జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై సమీక్ష
  • ఆధునిక డ్రోన్ ను తీసుకువచ్చిన అధికారులు
  • సర్వే వేగవంతానికి మరిన్ని డ్రోన్లు
  • అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం
జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై సీఎం జగన్ నేడు సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ ను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుకు తీసుకువచ్చారు. ఆ డ్రోన్ ను సీఎం జగన్ ఆసక్తిగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 

భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో 20 డ్రోన్లను కూడా రంగంలోకి దించనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ భూ హక్కు-భూ రక్ష పథకానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

  • వెబ్ ల్యాండ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
  • ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కాకుండా భౌతిక రికార్డులను కూడా రూపొందించాలి.
  • ఈ భౌతిక రికార్డులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలి. రికార్డులు ఎవరూ తారుమారు చేయలేని విధంగా ఉండాలి.
  • సబ్ డివిజన్ కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే సర్వే జరిగేలా ఉండాలి. 
  • అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి.
  • రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఇందులో న్యాయశాఖను కూడా భాగస్వామిగా చేయాలి. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి, ఆయా భూములపై వివాదాలు లేకుండా చూడాలి. 
  • ఏపీలో చేపట్టే భూ సర్వే, రికార్డుల నిర్వహణ దేశానికి దిక్సూచిలా నిలవాలి.  
  • ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు. 
.
DronesLand SurveyJaganna Bhu Hakku-Bhu Raksha

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more